ఐపీఎల్ 2021 ఎలిమినేటర్ లో భాగంగా ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు కోల్కత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి.. బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ సేన.. ఆది నుంచి పడింది. 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 138 పరుగులు చేసింది.
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బ్యాటింగ్ వివరాల్లోకి వెళితే.. కెప్టెన్ విరాట్ కోహ్లీ 39 పరుగులు, ఓపెనర్ పడిక్కల్ 21 పరుగులు , మ్యాక్స్ వెల్ 15 పరుగులు చేసి…. జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. ఇక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లు పూర్తిగా విఫలం కావడంతో… కేకేఆర్ జట్టు ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది బెంగళూరు జట్టు.
అటు కేకేఆర్ బౌలింగ్ విషయానికి వస్తే… సునీల్ నరైన్ ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు దెబ్బతీశాడు. అలాగే ఫెర్గూసన్ రెండు వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. ఇక ఈ మ్యాచ్ లో గెలవాలంటే కేకేఆర్ జట్టు 20 ఓవర్లలో 139 పరుగులు చేయాల్సి ఉంటుంది. మరి కాసేపట్లోనే కేకేఆర్ జట్టు బ్యాటింగ్ కు దిగనుంది.