వైసీపీకి బీసీలంటే ఓటు బ్యాంక్ మాత్రమే గాని బ్యాక్ బోన్ కాదు: కొల్లు రవీంద్ర

-

బీసీ సోదరులను కనీసం కూర్చోబెట్టి మాట్లాడకుండా జగన్ అవమానించారని టీడీపీ బీసీ సాధికార కమిటీ ఛైర్మన్ కొల్లు రవీంద్ర ఆరోపించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీకి బీసీలంటే ఓటు బ్యాంక్ మాత్రమే గాని బ్యాక్ బోన్ కాదని, బీసీలకు పెద్ద పీట వేస్తామని విజయవాడ సాక్షిగా జగన్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారన్నారు. పెద్ద పీట వేయడమంటే నిల్చోపెట్టి అవమానించడమేనా? అని ఆయన ప్రశ్నించారు. మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి కుర్చీలో కూర్చొని మాట్లాడుతుంటే బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, నాయకులను నిల్చోని మాట్లాడటం యావత్ బీసీ సోదరులందరికి అవమానకరమన్నారు.

‘ఇదేనా బీసీల పట్ల వైసీపీకున్న గౌరవం. ఒక బీసీ మంత్రితో మోకాళ్ల దండంతో మోకించించుకున్నారు. బడుగు బలహీన మంత్రుల అధికారాలను లాక్కొని సామంత రాజులకు అప్పగించారు. కేవలం 42 నెలల్లో 26 మంది బీసీలను హత్య చేశారు. 2650 మంది బీసీ సోదరులపై దాడులకు పాల్పడ్డారు. బీసీలను అణచేసి తమ అదుపులో పెట్టుకోవాలని వైసీపీ చూస్తోంది. బీసీ పీకలపై కత్తులు పెట్టి స్వార్ధానికి వాడుకొని వైసీపీ నేతలు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. బీసీల దమ్మేంటో త్వరలోనే చూపిస్తాం. వైసీపీ స్వార్ధపూరిత రాజకీయాలను బీసీలు గమనిస్తున్నారు.’ అని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version