పిల్లల కోసం ఆస్తులు అమ్ముకున్న జీవిత రాజశేఖర్..!

-

తెలుగు సినీ పరిశ్రమలు నటుడు రాజశేఖర్ తన భార్య జీవిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ తరచూ ఏదోక వార్తల్లో వివాదంగా మారుతూనే ఉంటారు. ముఖ్యంగా మా అసోసియేషన్ ఎన్నికల కార్యక్రమంలో ఎన్నికల సమయంలో జీవిత రాజశేఖర్ హంగామ ఎక్కువగా చేస్తూ ఉంటుందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇక వీరిద్దరికీ ఇద్దరు కుమార్తెలు. ఇందులో ఒకరు శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ మరొకరు. వీరిద్దరు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఇక వీరిపై జీవిత రాజశేఖర్ పలు ఆసక్తికరమైన కామెంట్లు చేసింది వాటి గురించి తెలుసుకుందాం.

జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. తమ కుమార్తెలు నటీమణులు కావడంపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యింది. తమ పిల్లలు జీవితంలో ఎదగాలని పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా కష్టపడుతూ ఉంటారు. అలాగే మేము కూడా కష్టపడ్డామని తెలియజేశారు జీవిత. తాజాగా డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో వచ్చిన పంచతంత్రం సినిమా నిన్నటి రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇందులో బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలో నటించారు. అంతేకాకుండా రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక కూడా ఇందులో నటించింది.

ఈ సందర్భంగా జీవిత మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తమ పిల్లలని సినిమాలలోనే పెరిగారని, కానీ వాళ్లు సినిమాలలోకి వస్తారనుకోలేదని పెద్దయ్యాక మేము కూడా యాక్ట్ చేస్తామని చెప్పడంతో తను రాజశేఖర్ చాలా టెన్షన్ పడ్డామని తెలియజేసింది. తమ పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు ఎంతో కష్టపడ్డాము వాళ్లకోసం మా ఆస్తులు కూడా అమ్ముకున్నాము. వారు ఏది అడిగితే అది చేసాము కానీ సినిమాలలో రాణించాలంటే మాత్రం అందుకు తగ్గట్టుగా పాత్రలు రావాలి.. వాటిని మనం కొనలేము అని తెలియజేసింది. సినిమాలలో నటిస్తామంటే కేవలం మా సపోర్టు ఇస్తాము కానీ సక్సెస్ లో మాత్రం భాగం కాలేమని తెలియజేసింది జీవిత. ప్రస్తుతం జీవిత రాజశేఖర్ చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version