Kollywood:అభిమానులకు విజయ్‌ దళపతి టీం గుడ్‌న్యూస్‌….

-

వెంకట్ ప్రభు దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ “దళపతి 68 “ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. GOAT టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగా ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే దళపతి 69 అప్‌డేట్ అందించారు.ఈ సినిమా డైరెక్టర్‌ కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో చేయనున్నాడు.సన్ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మించనున్నారు. గతేడాది జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌ సినిమాతో కార్తీక్ సుబ్బరాజు మంచి హిట్టు అందుకున్నాడు. డిఫరెంట్ స్టైల్‌లో వినోదాన్ని అందించే ఈ దర్శకుడు మరి విజయ్‌తో ఎలాంటి మూవీ చేయబోతున్నాడని ఆసక్తిగా మూవీ లవర్స్‌ ఎదురుచూస్తున్నారు.

 

GOATలో ప్రశాంత్‌, ప్రభుదేవా, లైలా, స్నేహ, మిక్ మోహన్‌, జయరాం,యోగిబాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version