రేవంత్‌రెడ్డి కి కండీష‌న్లు పెడుతున్న కోమ‌టిరెడ్డి.. అలా అయితేనే మ‌ద్ద‌తిస్తారంట‌..

-

టీపీసీసీ చీఫ్‌గా మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కనిపించాయి. కానీ, ఆ పార్టీలోని సీనియర్ నేతలు మాత్రం రేవంత్ నాయకత్వాన్ని బలపర్చేందుకు ముందుకు రాలేదు. ఈ క్రమంలో కొందరు డబ్బులిచ్చి పీసీసీ చీఫ్ పదవిని కొన్నారనే కామెంట్స్ కూడా చేశారు. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం, రాజకీయ అధికారంలోకి పార్టీని తీసుకొచ్చేందుకుగాను రేవంత్ పోరు షురూ చేశారు. ఈ క్రమంలోనే ‘దళిత, గిరిజన దండోరా’ పేరిట ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో సభ నిర్వహించారు.

అయితే, సభకు పార్టీ సీనియర్ నేతలు హాజరు కాలేదు. కాగా తాజాగా తర్వాత సభకు రావడానికి సిద్ధమేనని తాను సిద్ధమేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 18న ఇబ్రహీం‌పట్నంలో నిర్వహించబోయే సభకు వచ్చేందుకు రెడీయే కానీ, తనకు పార్లమెంటరీ కమిటీ పర్యటన ఉన్నందున ఈ నెల 18న కాకుండా 21వ తేదీ తర్వాత సభను ఎప్పుడు పెట్టినా హాజరవుతానని తెలిపారు కోమటిరెడ్డి. కాగా, రేవంత్ నాయకత్వాన్ని బలపరిచేందుకు సీనియర్ నేత ముందుకు రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఒక్కొక్కరుగా సీనియర్ నేతలు రేవంత్ నాయకత్వంలో పని చేయడానికి ముందుకొచ్చే అవకాశాలు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే వెంకట్‌రెడ్డి రేవంత్‌కు సపోర్ట్ చేయడం ద్వారా అగ్రశ్రేణి నాయకత్వాన్ని బలపర్చేందుకుగాను నల్లగొండ జిల్లా నుంచి కాంగ్రెస్ శ్రేణులు తరలివస్తాయని అంచనా వేసుకుంటున్నారు నేతలు. అయితే, ఇబ్రహీంపట్నంలో సభ నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నందున సభకు పర్మిషన్ ఇవ్వడం లేదని చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version