సిగ్గు ఉండాలి.. కేసీఆర్ పై కోమటిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్..!

-

బీఆర్ఎస్ నాయకులు మోకాళ్ల యాత్ర చేసిన నల్లగొండలో కానీ భువనగిరిలో కానీ డిపాజిట్లు కూడా రావని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. భువనగిరిలో ఈరోజు మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో 13 నుండి 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా ని పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు.

komatireddy on kcr

నీటి వాటాల విషయంలో కెసిఆర్ జగన్ తో లాలూచీ పడ్డారని ఫైర్ అయ్యారు. కెసిఆర్ వల్లనే నల్లగొండ జిల్లాలో కరువు తాండవం చేస్తుందన్నారు. అసలు కెసిఆర్ బస్సు యాత్ర చేయడానికి సిగ్గుండాలి అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాజకీయాల్లో బీఆర్ఎస్ శకం ముగిసిందని ఆ పార్టీని పట్టించుకునే నాధుడు లేడని అన్నారు. బిజెపి మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయాలు చేస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news