ఆ ఇద్దరికీ బుద్ది చెప్పాలి : కేటీఆర్

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన రంజీత్ రెడ్డి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఓట్లతో బుద్ది చెప్పాలన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో చేవెళ్లలోని రాజేంద్రనగర్ లో ఆయన మాట్లాడారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పారిపోయే పిరికి పందలకు బుద్ది చెప్పాలని పార్టీ నేతలను కోరారు. బీఆర్ఎస్ కి 8 నుంి 10 సీట్లు ఇస్తే.. కేంద్రంలోని ప్రభుత్వం తాము చెప్పినట్టే వింటుందన్నారు.

KTR sensational announcement on Khammam MP position

బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్ వంటి పథకాలను ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. రైతులకు రైతుబీమా, రైతు బంధు వంటి పథకాలను ప్రేవేశపెట్టిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో శ్రమించారని.. తెలంగాణ కోసం పోరాడిన వీరులకు తగిన న్యాయం జరగాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news