కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తో కోమటిరెడ్డి భేటీ

-

కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. జాతీయ రహదారికి 930P నంబరు గల జై శ్రీరామ రహదారిని కేటాయించి DPRని ఆమోదించిందని.. కావున వెంటనే పనులు ప్రారంభించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఈ సందర్భంగా కోమటిరెడ్డి కోరారు. అనంతరం కోమటి రెడ్డి మాట్లాడుతూ.. ORR జంక్షన్ గౌరెల్లి వద్ద నుండి భూధాన్ పోచంపల్లి -వలిగొండ – తిరుమలగిరి – తొర్రూర్ – నెల్లికుదురు – మహబూబాబాద్ – యెల్లందు – భద్రాచలం మీదుగా 100 కి.మీల భోంగీర్టు పార్లమెంటరీ కాన్సస్ కింద భద్రాచలం కొత్తగూడెం వద్ద NH 30 జంక్షన్ వరకు ప్రారంభమవుతుందని తెలిపారు.

ఈ కొత్త NH వేయడం ద్వారా వైజాగ్ పోర్ట్ నుండి ఛత్తీష్‌గఢ్ మీదుగా హైదరాబాద్‌కు దాదాపు 100 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని.. తెలంగాణ రాష్ట్రంలో, ఈ NH గోదావరి నది ఒడ్డు గుండా వెళుతుందన్నారు. ప్రస్తుతం ఈ రహదారి చాలా ఇరుకుగా ఉండటం వలన తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని.. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రయాణికులు తమ విలువైన జీవితాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యాక్తం చేశారు.

ఈ రోడ్డు నిర్మాణానికి ఇంకా చాలా తక్కువ భూసేకరణ మాత్రమే మిగిలి ఉందని.. వెంటనే పనులు ప్రారంభించేలా టెండర్లు పిలిచి కాంట్రాక్టు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రిని కోరానని వెల్లడించారు. దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించి ఇప్పటికే భూసేకరణ జరిగిన మేరకు టెండర్లు పిలవాలని హాజరైన అధికారులను ఆదేశించారని తెలిపారు. ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని కూడా మంత్రి అధికారులతో మరోసారి సూచించారన్నారు కోమటి రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news