రేవంత్ రెడ్డి మీద సంచలన ఆరోపణలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి వెనకాల 20 మంది ఆంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారని బాంబు పేల్చారు. వారంతా తెలంగాణ సంపద దోచుకుంటున్నారు… త్వరలోనే వారి బండారం బైటపెడతా అని వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.

సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలి.. హావభావాలు మార్చుకోవాలని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గంటలు గంటలు మాట్లాడకుండా.. ఆ శ్రద్ధ పని మీద చూపించాలని చురకలు అంటించారు.
ఇంకో మూడున్నర ఏళ్లు ఆయనే సీఎం.. ఆ తర్వాత ఎవరు అనేది అధిష్టానం, ప్రజలు నిర్ణయిస్తారు అని పేర్కొన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రతిపక్షాలను పదే పదే తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పాలని కోరారు. 20 మంది సీమాంధ్రా కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇంకా మూడున్నరేళ్లు రేవంతే సీఎంగా ఉంటాడు కానీ ఆయనకు అంత ఆవేశం పనికిరాదన్నారు.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
రేవంత్ రెడ్డి మీద సంచలన ఆరోపణలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
రేవంత్ రెడ్డి వెనకాల 20 మంది ఆంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారు
వారంతా తెలంగాణ సంపద దోచుకుంటున్నారు
త్వరలోనే వారి బండారం బైటపెడతా – కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి https://t.co/9Nt7nCTIQg pic.twitter.com/Ha0UX0ZYGJ
— Telugu Scribe (@TeluguScribe) August 6, 2025