కడప: తెలంగాణలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని షర్మిల పార్టీ మద్దతుదారుడు కొండా రాఘవరెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా ఇడుపులపాయ వైఎస్ ఘాట్ వద్ద షర్మిలతో పాటు ఆయన కొండా రాఘవరెడ్డి నివాళర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ పాలన మళ్లీ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. పార్టీ ఏర్పాటుకు ముందే ప్రజా సమస్యలపై షర్మిల దీక్షలు చేశారని చెప్పారు. తెలంగాణ ప్రజలు షర్మిలకు బ్రహ్మరథం పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు: కొండా రాఘవరెడ్డి
-