కాబోయే భర్తతో నిహారిక.. ఫోటో షేర్‌ చేసిన మెగా డాటర్‌..

-

మెగా బ్రదర్ నాగబాబు కూతురు, సినీ నటి నిహారిక పెళ్లి గురించి ఇప్పటికే బోలెడు వార్తలు వచ్చాయి.. ఇంకా వస్తున్నాయి కూడా. అయినా అవన్నీ పుకార్లగానే మిగిలిపోయాయి తప్ప దేనిపైనా ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు మాత్రం నిహారిక పెళ్లి విషయమై ఒక క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తుంది. తనకు వివాహం జరగబోతుందని అభిమానులకు తెగ హింట్స్ ఇస్తోంది మెగా డాటర్ నిహారిక కొణిదెల. ఈ ఉదయం మిసెస్ అంటూ తెలపగా ఇప్పుడు ఏకంగా ఓ వ్యక్తిని హాగ్ చేసుకున్న ఫోటోను ఇన్స్టాలో అప్లోడ్ చేసింది.

అయితే, కాబోయే భర్త ముఖాన్ని మాత్రం చూపించలేదు. పైగా దీనికి ‘Peek-a-boo’ (దాగుడుమూతలు) అనే క్యాప్షన్ పెట్టారు. అంటే, పెళ్లికొడుకు ఎవరో మనమే గెస్ చేయాలని ఆమె ఉద్దేశం. అయితే దీనిపై సినీ వర్గాల్లో నడుస్తున్న టాక్ ప్రకారం.. అబ్బాయిది గుంటూరు అని, అతని పేరు చైతన్య అని అంటున్నారు. ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి కుమారుడని, హైదరాబాద్‌లోని ఓ ఎంఎన్‌సీ కంపెనీలో పనిచేస్తున్నాడాని సమాచారం. మరి ఇతన్నే నిహారిక పెళ్లి చేసుకోబోతోంది అంటూ టాక్ వినిపిస్తుండగా..నిజం ఏంటో మరో రెండు రోజులో మెగా ఫ్యామిలీ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version