కోవిడ్ యాంటీ బాడీస్ దీర్ఘకాలికంగా ఉండవు…!

-

కరోనా వైరస్ యాంటీ బాడీస్, ఒకసారి అభివృద్ధి చెందితే మనం కరోనా వైరస్ పై పోరాడటానికి అవి మనకు దీర్ఘకాలికంగా ఉంటాయా…? రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయా…? అనే దానిపై ఒక క్లారిటీ వచ్చింది. ఇది కచ్చితంగా ఏ ఒక్కరికి సాధ్యం కాదని అన్నారు. ఒక కొత్త అధ్యయనం ప్రకారం కరోనా బారిన పడిన తర్వాత… యాంటీబాడీ ప్రతిస్పందన వాస్తవానికి కాలక్రమేణా రోగనిరోధక శక్తిని పెంచడానికి బదులుగా స్కేల్ చేస్తుంది అని గుర్తించారు.

వ్రుద్దులలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. జూన్ 20 మరియు సెప్టెంబర్ 28 మధ్య లండన్ లోని ఇంపీరియల్ కాలేజీ పరిశోధకులు 365,000 మందిని పరీక్షించారు. మొదటి రౌండ్ పరీక్షల తరువాత కేవలం 3 నెలల తరువాత, యాంటీ బాడీస్ 26 శాతం తగ్గాయని వారు గుర్తించారు. రోగనిరోధక శక్తి ప్రతిరోధకాలు ఏ స్థాయిలో మనకు రక్షణ అందిస్తాయో లేదా ఈ రోగనిరోధక శక్తి ఎంతకాలం ఉంటుందో స్పష్టంగా తెలియదు.” అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news