స్థానిక ఎన్నికలు… నిమ్మగడ్డకు నాలుగే నాలుగు ప్రశ్నలు!!

-

తాను మైకందుకున్న ప్రతిసారీ తనది రాజ్యాంగపద్ద పదవి అని చెప్పుకునే నిమ్మగడ్డ రమేష్ కుమార్… ఒక పవిత్రమైన రాజ్యాంగ కర్తవ్యంగా భావించాల్సిన ఎన్నికల నిర్వహణను.. ఒక డ్రామాగా భావిస్తున్నారు అనేది వైకాపా నేతల వాదనతో పాటు ఒక వర్గం ప్రజల వాదన! ఈ సమయంలో నిమ్మగడ్డపై నాలుగు ప్రశ్నలు సంధిస్తున్నారు వైకాపా నేతలు!

* నేడు ఆల్ పార్టీ మీటింగ్ కి అన్ని పార్టీలను పిలిచి మీటింగ్ పెడుతున్న నిమ్మగడ్డ… రాష్ట్రంలో 3 కోవిడ్‌ కేసులు కూడా లేని రోజుల్లో ఏ రాజకీయ పార్టీలను అడిగి ఎన్నికలను వాయిదా వేశారు?

* ఇప్పుడు దాదాపు రోజుకు 3 వేల కేసులు నమోదవుతున్న సమయంలో, ఒకసారి కోవిడ్‌ సోకిన వారికి రెండోసారి సోకుతున్న నేపథ్యంలో ఏ ఉద్దేశ్యంతో ఎన్నికలు నిర్వహిస్తున్నారు?

* ఎన్నికల నిర్వహణ విషయంలో.. ఓటువేసే ఓటరు భద్రతను అంటే 3 కోట్ల ప్రజల భద్రతనుంచి.. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే టీచర్లు, ఇతర ఉద్యోగ సోదర, సోదరీమణులు, పోలీసుల వరకూ ప్రతి ఒక్కరి భద్రతకు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ బాధ్యత వహిస్తారా?

* స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాల మీద ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు ఉన్నాయా లేదా అనే అంశంపైనా.. ఆ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీతో, మొత్తంగా ప్రభుత్వంతో చర్చించి వారి అభిప్రాయం ప్రకారం ముందుకెళ్లాలి కానీ… రాష్ట్రంలో ఉనికే లేని, పోటీలో లేని, ఒక్క ఓటు కూడా లేని రాజకీయ పార్టీలను పిలిపించి చర్చించామని చెప్పుకోవడాన్ని ఏమని భావించాలి?

ఈ నాలుగు ప్రశ్నలు వైకాపా నేతల నుంచే కాకుండా సామాన్యుల నుంచి కూడా వ్యక్తమవుతున్న తరుణంలో… ఈ ప్రశ్నలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక ఎన్నికల అధికారిగా, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిగా సమాధానం చెప్పగలుగుతారా? చెప్పకుండానే ముందుకు వెళ్తారా? ఇది ప్రజాస్వామ్యం అని మరుస్తారా? వేచి చూడాలి!!

Read more RELATED
Recommended to you

Latest news