దేవినేని ఉమా… ఈ పేరంటేనే కృష్ణా టీడీపీకి అస‌హ్య‌మా..!

-

దేవినేని ఉమా ఇప్పుడు కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో చుక్కలు చూపిస్తున్న నేత. ఎవరూ ఎదగకూడదు తాను మాత్రమే పైన ఉండాలని భావించిన నేత. ఈయన గారి దెబ్బకు పార్టీలో ఉండాలి అంటేనే తెలుగుదేశం సీనియర్ నేతలు కూడా ఇబ్బంది పడుతున్నారట. చంద్రబాబుకి అత్యంత సన్నిహిత నేతగా, పార్టీలో నెంబర్ 2 అని చెప్పుకు తిరిగే ఉమా ఈ ఎన్నిక‌ల్లో మైలవరం నుంచి దారుణంగా ఓడిపోయారు. అనుభవం ఉన్నా సరే అక్కడి ప్రజలు భరించలేక ఆయన్ను ఓడించారని తెలుగుదేశం నేతలే అనే పరిస్థితులు ఉన్నాయి.

ఆయ‌న చిర‌కాల రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ స‌వాల్ చేసి మ‌రీ ఉమాను ఓడించాడు.
ఇప్పుడు ఆయన గురించి కొన్ని వ్యాఖ్యలు వినపడుతున్నాయి. పార్టీలోని కొందరు నేతలు ఆయన పేరు వింటేనే చిరాకు పడే పరిస్థితి ఏర్పడింది. కమ్మ సామాజిక వర్గంలో ఉన్న మరో నేతను ఆయన ఎదగనివ్వరు అనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే పార్టీలో ఇమేజ్ వస్తుందని భావించి… కొడాలి నానీ బ‌య‌ట‌కు వెళ్ళే వరకు పోగాబెడుతూ వచ్చారు.

ఇక్క కొడాలి నానియే కాదు…. దాస‌రి బాల‌వ‌ర్థ‌న్‌రావు సోద‌రులు, మండ‌లి బుద్ధ ప్ర‌సాద్‌, గ‌ద్దె రామ్మోహ‌న్‌, వ‌ల్ల‌భ‌నేని వంశీ, కేశినేని నాని, బొండా ఉమా, బుద్ధా వెంక‌న్న వీళ్లంద‌రు టీడీపీలో ఉమా బాధితులే. ఇక ఈ ఎన్నిక‌ల్లో ఉమా ఓడిపోవడంతో ఇప్పుడు కూడా పార్టీలో ఆయ‌న పెత్త‌న‌మే న‌డుస్తోంది. ఓడిన‌ తర్వాత ఉమా దృష్టి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మీద పడింది. ఎన్నిక‌ల‌కు ముందే వంశీ మోహన్ కి సీటు రాకుండా ఉండేందుకు ఉమా గట్టి ప్రయత్నాలే చేస్తూ వచ్చారు. అయినా సరే వంశీ సీటు తెచ్చుకుని గెలిచారు.

ఇక కేశినేని నానీ కూడా విజయవాడ నుంచి ఎంపీ గా పోటి చేయకూడదు అని భావించిన ఉమా… గట్టి ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఇలా ఎవరికి అయితే ఇమేజ్ వస్తుందో వారిని టార్గెట్ చేస్తున్నారు ఆయన. ఇక నియోజకవర్గంలో సొంత సామాజిక వర్గం వారు ఎవరు వచ్చినా సరే ఉమా పనులు చేసే వారు కాదట. ఈ విధంగా పార్టీలో ఉమా బాధితులు ఇప్పుడు ఒక్కొక్కరుగా పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. వంశీ ఇప్పటికే పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. ఇక బొండా ఉమను కూడా ఆయన ఇబ్బంది పెడుతున్నారనే వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version