ముందు షికార్లు.. ఆ తర్వాతే పెళ్లి అంటోన్న హీరోయిన్

ఇంకొన్నాళ్లు కలిసి తిరగనివ్వండి. అయినా ఏడాదిన్నర రిలేషన్‌కే పెళ్లి చేసుకుంటారా.. చాలా చూడాలి.. చాలా నేర్చుకోవాలి.. అప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తామంటోంది ఒక హీరోయిన్. మరి రిలేషన్‌కి ఓకే గానీ పెళ్లికి టైమ్‌ కావాలంటోన్న కృతి కర్బంద.

పక్కా ముంబాయి హీరోయిన్‌లా మారిపోతోంది కృతి.. ముందు లవ్‌ చేసుకుంటాం, షికార్లకి వెళ్తాం, అప్పటికీ ఈక్వేషన్స్‌ బావుంటే పెళ్లి చేసుకుంటాం, లేకపోతే లేదు అనే ఇదిలో ఉంది కృతి కర్బంద. పుల్కిత్‌ సామ్రాట్‌తో ఏడాదిన్నరగా లవ్‌లో ఉన్నారు కదా, పెళ్లి ఎప్పుడు అంటే ఇంకొంచెం ముందుకెళ్లాక అంటోంది కృతి.

కృతి కర్బంద సౌత్‌లో సినిమాలు తగ్గిపోయాక బాలీవుడ్‌కి వెళ్లింది. అక్కడ చిన్నచిన్న సినిమాలతో కెరీర్‌ నెట్టుకొస్తోంది. అయితే స్ట్రగుల్స్‌లో బాలీవుడ్‌కి వెళ్లిన కృతి ‘వీరేకి వెడ్డింగ్‌’లో పుల్కిత్ సామ్రాట్‌కి దగ్గరైంది. ఇక అప్పటికే భార్యతో విడిపోయి సింగిల్‌గా ఉంటోన్న పుల్కిత్‌, కృతి రిలేషన్‌ని మరింత ముందుకు తీసుకెళ్లాడు. ఇద్దరు కలిసి ‘పాగల్‌పంతి, తాయిష్’ సినిమాలు చేశారు.

కృతి కర్బంధ ఇప్పుడు థర్టీ క్రాస్‌ చేసింది. దీంతో ఇప్పుడైనా పుల్కిత్‌ సామ్రాట్‌తో పెళ్లి గురించి ఆలోచిస్తున్నారా అని సన్నిహితులు అడిగితే దానికి ఇంకా టైమ్‌ ఉంది. అయినా పుల్కిత్‌తో రిలేషన్‌ స్టార్ట్ అయి ఏడాదిన్నరేగా అవుతోంది. మరింత ముందుకెళ్లినప్పుడు చూద్దాం అని ఆన్సర్‌ చేస్తోందట కృతి. మరి ఈ రిలేషన్‌ ఇంకెంత ముందుకెళ్లాక వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారో చూడాలి.