కేటీఆర్ అహంకారి.. వేముల వీరేశం మరోసారి సంచలన వ్యాఖ్యలు

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై  నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీకి బీటీమ్ గా మారి ఘర్షణలు చేయిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ను అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. స్థానికులకు ఉద్యోగాల కోసమే ఇండస్ట్రీయల్ కారిడార్ అని అన్నారు.

Vemula Veeresham

లగచర్ల ఘటనలో కేటీఆర్ పాత్ర పై పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. ఆయన పాత్ర ఉంటే వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కుట్రలో భాగంగానే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఈ దాడికి ప్లాన్ చేశారని ఆరోపించారు. కొడంగల్ లో దళిత, గిరిజన, బీసీ బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ జరుపుతుండగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే కేటీఆర్ ఇలా వ్యవహరించారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version