తెరాస ప్రకటించిన తొలి ఎంపీ అభ్యర్థి ఎవరో తెలుసా?

-


గెలుపే లక్ష్యంగా తెరాస వ్యూహాలు ఫలిస్తున్న సందర్బంగా…త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో తొలి ఎంపీ అభ్యర్థిని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే సారి 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి ఘన విజయం సాధించారు. ఇదే రకమైన దూకుడుని పార్లమెంటు ఎన్నికల్లోనూ ప్రదర్శించనున్నారు. ఇందులో భాగంగా…. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్న కేటీఆర్.. గురువారం తన నియోజకవర్గమైన సిరిసిల్లలో పర్యటన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ మరోసారి పోటీ చేస్తారని తేల్చి చెప్పారు. దీంతో ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలందరికీ మళ్లీ టికెట్లు ఇవ్వబోతున్నట్టు తెరాస అధినేత  సంకేతాలిచ్చిన సంగతి తెలిసిందే.

జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించడానికి ఎంపీల విజయమే కీలకం కాబట్టి… నాన్ కాంగ్రెస్ – నాన్ భాజపా కూటమి ఏర్పాటులో భాగంగా కేసీఆర్ ఇప్పటికే తమ సిట్టింగ్ ఎంపీలతో పలు మార్లు చర్చలు జరిపి విజయం దిశగా అడుగులు వేస్తున్నారు.  జాతీయ రాజకీయాల మీద దృష్టి సారించిన సీఎం కేసీఆర్.. పార్లమెంట్ ఎన్నికల బరిలోకి స్వయంగా దిగుతారని ఈమధ్య వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరి సీఎం కేసీఆర్ ఏ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తారనే విషయం పై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఏది ఏమైన ఇటు రాష్ట్రంలోనూ, అటు జాతీయ స్థాయిలోనూ తెరాస తమ సత్తాను మరోసారి చాటనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version