గడ్డం లుక్‌లో కేటీఆర్‌.. నెటిజ‌న్లు ఫిదా…

-

కేటీఆర్ క్లీన్ లుక్‌కు గ‌డ్డం, మీసాలను ఫేస్‌యాప్ ద్వారా జోడించిన ఓ వ్య‌క్తి ఆయ‌న ఫొటోను మార్ఫింగ్ చేసి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. దీంతో కేటీఆర్ గ‌డ్డం, మీసాల‌తో ఉన్న ఆ ఫొటో కాస్తా ఇప్పుడు నెట్‌లో వైర‌ల్ అవుతోంది.

టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పుడూ క్లీన్ లుక్‌లో క‌నిపిస్తారు. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సంద‌ర్భంలో కూడా గ‌డ్డం, మీసాల‌తో క‌నిపించ‌లేదు. కానీ.. ఆయనకు గ‌డ్డం, మీసాలు ఉంటే ఎలా ఉంటుంది.. అని ఓ అభిమానికి ఆలోచ‌న వ‌చ్చింది. ఇంకేముంది.. కేటీఆర్ ఓ కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగిస్తున్న ఫొటోను ఫేస్‌యాప్ ద్వారా ఆ వ్య‌క్తి మార్ఫింగ్ చేశాడు. దాన్ని కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. దీంతో కేటీఆర్ కూడా ఆ ఫొటోపై స్పందించారు.

కేటీఆర్ క్లీన్ లుక్‌కు గ‌డ్డం, మీసాలను ఫేస్‌యాప్ ద్వారా జోడించిన ఓ వ్య‌క్తి ఆయ‌న ఫొటోను మార్ఫింగ్ చేసి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. అన్నా.. గ‌డ్డం, మీసాల‌తో మీరు చాలా హ్యాండ్స‌మ్‌గా ఉన్నారంటూ.. ఆ వ్య‌క్తి కేటీఆర్‌కు ట్వీట్ చేయ‌గా, దాని ప‌ట్ల కేటీఆర్ స్పందించారు. ఫ‌ర్వాలేదు.. ఇలా కూడా బాగానే ఉన్నా.. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీంతో కేటీఆర్ గ‌డ్డం, మీసాల‌తో ఉన్న ఆ ఫొటో కాస్తా ఇప్పుడు నెట్‌లో వైర‌ల్ అవుతోంది.

అయితే ఈ విష‌యం తెలియ‌ని కొంద‌రు మాత్రం నిజంగానే కేటీఆర్ గ‌డ్డం, మీసాల‌తో ఉన్నారేంట‌బ్బా.. అనుకుని పొర‌పాటు ప‌డుతున్నార‌ట‌. కానీ అది మార్ఫింగ్ ఫొటో అని తెలిసి అవాక్క‌వుతున్నారు. అవును మ‌రి.. ఫేస్‌యాపా.. మ‌జాకా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version