టీఆర్ఎస్ గెలిచాక 14 నెలల్లో మునుగోడు అభివృద్ధి : కేటీఆర్

-

టీఆర్ఎస్ గెలిచాక 14 నెలల్లో చౌటుప్పల్‌, చండూరు పురపాలికలను, మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేసే బాధ్యత తనదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. అడగకుండానే అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే నియోజకవర్గంలో 79 వేల మందికి రైతు బంధు, 43 వేల మందికి ఆసరా పింఛను వస్తోందని, 9,990 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులిచ్చామని చెప్పారు. ఈ లబ్ధిదారులంతా ఓటు వేస్తే ప్రత్యర్థి డిపాజిట్‌ గల్లంతు అవుతుందని తెలిపారు.

దండు మల్కాపురంలో ఆసియాలోనే పెద్దదైన 580 ఎకరాల పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నట్టు కేటీఆర్ చెప్పారు. ఫ్లోరైడ్‌ నీళ్ల భయంతో మునుగోడుకు పిల్లనిచ్చేవాళ్లు కాదని, 65 ఏళ్లలో పరిష్కారం కాని సమస్యను మిషన్‌ భగీరథ పథకంతో  పరిష్కరించామని అన్నారు. నాలుగేళ్ల పాటు అనాథలా మారిన మునుగోడులో టీఆర్ఎస్ ని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో శుక్రవారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news