ఇటీవల తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పొరుగు రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఇంకా ప్రకంపనలు రేపుతున్నాయి.అయితే ఆ మరుసటి రోజే..తన వ్యాఖ్యల వెనుక ఎలాంటి ఉద్దేశాలు లేవని, జగన్ పరిపాలన లో ఏపీ అభివృద్ధి పథంలో పయనించాలని, జగన్ నాకు సోదరుడి లాంటి వాడిని, కేటీఆర్ ట్వీట్ చేయగా, సిపిఐ నారాయణ తప్పుబట్టారు.ఇవాళ మేడే సందర్భంగా రాజమండ్రిలో పర్యటించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ..
ఏపీ పై చేసిన వ్యాఖ్యల పట్ల కేటీఆర్ రాత్రికి రాత్రే మాట మార్చేశారని నారాయణ ఆరోపించారు.బహుశా ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలతోనే కేటీఆర్ మాట మార్చారేమో అని సందేహం వ్యక్తం చేశారు.ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వానంగాా ఉందన్నది వాస్తవం అని, రోడ్ల పరిస్థితిని నగరిలో తానే ప్రత్యక్షంగా చూశానని నారాయణ వెల్లడించారు.తన వీడియో చూసిన మంత్రి రోజా రోడ్డు బాగు చేయాలని వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చారని వివరించారు.