సీఎం రేవంత్ ప్రభుత్వం చేత సన్మానం చేయించుకోలేనని ప్రకటించిన ప్రముఖ కవి నందిని సిధారెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. ‘తెలంగాణ తల్లి రూపం మార్చి, బతుకమ్మను తొలగించడం మన రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, మరియు ఆత్మగౌరవానికి చెరగని మచ్చ. సంస్కృతిని హననం చేసే ప్రభుత్వం చేత సన్మానం చేయించుకోలేనని ప్రకటించి.. రేవంత్ ప్రభుత్వ చర్యను నిరసిస్తూ.. ప్రముఖ కవి నందిని సిధారెడ్డి గారు తీసుకున్న సాహసోపేతమైన, ఉదాత్త నిర్ణయం ప్రతి తెలంగాణవాసికి గర్వకారణం.
తెలంగాణ ఆత్మగౌరవం, సంస్కృతి పరిరక్షణకు సిధారెడ్డి గారు చూపిన నిబద్ధతకు నా హృదయపూర్వక అభినందనలు. ఆత్మగౌరవ పరిరక్షణ ఉద్యమంలో సిధారెడ్డి మార్గదర్శకత్వానికి శిరస్సు వంచి నమస్కారాలు’ అని మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. అంతకుముందు చేసిన ట్వీట్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాజీవ్ గాంధీ పేరు వినిపించకుండా చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.