ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. తాజాగా మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు టీచర్ పోస్టుల భర్తీపై కీలక ప్రకటన చేశారు. వచ్చే సంవత్సరం టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన వివరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ఎక్కువ పింఛన్… ఇస్తున్న రాష్ట్రంగా ఉందని గుర్తు చేశారు నారా చంద్రబాబు నాయుడు.
ఇతర రాష్ట్రాల్లో మనం ఇస్తున్న పింఛన్లు సగం కూడా ఇవ్వడం లేదని గుర్తు చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. వచ్చే ఏడాది స్కూళ్లు ప్రారంభం నాటికి… టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. దీపం 2 పథకం ద్వారా దాదాపు 40 లక్షల మహిళలకు ఉచితంగా సిలిండర్లు ఇస్తున్నామని తెలిపారు. వచ్చే సంక్రాంతి వరకు రోడ్లపై ఉన్న గుంతలను పూడుస్తామని కూడా హామీ ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు.