బీసీ బిల్లు కోసం రేవంత్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీలో ధర్నాకు రాలేదని అంటున్నారు..మరి రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే ఎందుకు రాలేదు? అని నిలదీశారు. రేవంత్ రెడ్డి 52 సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రి అపాయింట్మెంట్ లేకుండా తిరిగి వచ్చాడా? అని ప్రశ్నించారు కేటీఆర్.

బీసీ బిల్లుపై చర్చ జరుగుతున్న తరుణంలో అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ షాకింగ్ కామెంట్స్ చేసారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మా పార్టీకి మూడు ప్రోటోకాల్ పొజిషన్లు ఉంటే వాటిల్లో రెండు బీసీ బిడ్డలకు ఇచ్చి.. మా పార్టీ నిబద్ధతను చాటుకున్నామన్నారు.
బలహీన వర్గాల నుండి మొట్ట మొదటి అడ్వకేట్ జనరల్ గా బీఎస్ ప్రసాద్ గారిని చేసింది కేసీఆర్ ప్రభుత్వం అని గుర్తు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్. బీసీలకు 42% రిజర్వేషన్ అంశం గురించి రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ఎందుకు మాట్లాడటం లేదు అని నిలదీశారు కేటీఆర్.