బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదు బహుజన రాష్ట్ర సమితి అన్నారు గంగుల కమలాకర్. ఈ బీసీ బిల్లు పాస్ అయ్యి 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే ఈ సూచనలు పాటించండి అని మాత్రమే చెప్తున్నామని పేర్కొన్నారు. మా సూచనలు మీరు విమర్శలుగా భావించకండి అని కోరారు గంగుల కమలాకర్.

ఇవాళ అసెంబ్లీలో బీసీ బిల్లుపై గంగుల కమలాకర్ మాట్లాడారు. అసెంబ్లీలో బిల్లు పెట్టి జీవో పాస్ చేయడానికి 20 నెలలు ఎందుకు టైమ్ వేస్ట్ చేశారు.. ఈ పని అప్పుడే చేసి, ఎన్నికలకు వెళ్ళాల్సిందన్నారు. మార్చి 2024లో జీవో నెంబర్ 26ను బీసీ కమిషన్ ద్వారా తీసుకొచ్చారు.. ఆ తర్వాత బీసీ కమిషన్ మాయమైంది అని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.
మార్చిలో చేసిన బిల్లు ఏమైంది.. ఇది కూడా అలా అవ్వొద్దు, బీసీలకు 42% రిజర్వేషన్ రావాలంటే మా సూచనలు తీసుకోండి… జీవో ఇస్తే న్యాయస్థానాల్లో నిలబడదు కాబట్టి.. రాజ్యాంగ పరిధిలో తొమ్మిది షెడ్యూల్‌లో చేర్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు.