అందుకే తగలబెడుతున్నారు.. కేటీర్ ఫైర్..!

-

కాంగ్రెస్ సర్కారు మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇక వివరాల్లోకి వెళితే ఘట్కేసర్లో బీఆర్ఎస్ ఆత్మీయ సభలో కేటీఆర్ మాట్లాడం జరిగింది హామీలు అమలు చేయని సీఎం చేతులెత్తేసారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్లు కడుపు మండి ఆటోలు తగలబెట్టే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ అన్నారు. కృష్ణాజిల్లాలో మా వాటా ఎంత అంటే తేల్చలేదు అని అన్నారు. మన వాటా తేల్చకుండానే కేఆర్ఎంబికి అంతా అప్పగించారని చెప్పారు.

మన ప్రయోజనాలని కాంగ్రెస్ కేంద్రానికి తాకట్టు పెట్టిందని చెప్పారు అందుకే జాతీయ పార్టీలని నిలదీయాలంటే బీఆర్ఎస్ ఉండాలని చెప్పారు తెలంగాణ ప్రయోజనాలని కాపాడాలంటే బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలని చెప్పారు. కేంద్రంలోని బిజెపికి చెక్ పెట్టాలని అన్నారు కాంగ్రెస్ 420 హామీలను ఇచ్చి ఎన్నికల్లో గెలిచింది డిసెంబర్ 9న 2 లక్షల రైతులకి రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి అన్నారని రెండు నెలలు గడుస్తున్నా రైతులకు రుణమాఫీ జరగలేదని ఉచిత బస్సు వలన ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని అన్నారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news