గుడ్ న్యూస్ : త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు !

-

ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మంత్రి కేటీఆర్ పలు రంగాలకు చెందిన వారితో భేటీ అవుతున్నారు. తాజాగా ఆయన కొన్ని కీలక ప్రకటనలు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక లక్ష 30 వేల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చామని, నోటిఫికేషన్ల పై శ్వేతపత్రం విడుదల చేశామని అన్నారు. అలాగే త్వరలోనే 50 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు రాబోతున్నాయని అన్నారు. నోటిఫికేషన్లు ఇవ్వలేదని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ? 10 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో 24 వేల ఉద్యోగాలు మాత్రమే కల్పించారు కదా అని అన్నారు.

నిరుద్యోగుల అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని అన్నారు. చేతకాని ప్రభుత్వం అని మన్మోహన్ ప్రభుత్వాన్ని మోడీ విమర్శించారని, ఓటేసే ముందు సిలిండర్ కు మొక్కి ఓటేయాలని అన్నారు, ఇప్పుడు ఎవరికి మొక్కాలి ? అని ఆయన ప్రశ్నించారు. 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మోడీ చెప్పారు, 12 కోట్ల ఉద్యోగాలు ఎక్కడో బీజేపీ నేతలు చెప్పాలని అన్నారు. ఆత్మగౌరవంతో ఏ పని చేసిన తప్పు కాదు, కానీ వాటిని కూడా తమ అకౌంట్లో జమ చేసుకోవడం దారుణమని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news