తెలంగాణాలో ఎన్నికలకు ముందు అన్ని పార్టీలు ప్రజల నుండి ఓట్లను తమకు అనుకూలంగా రాబట్టుకోవడానికి ఎన్నో హామీలను ఇస్తారు. కానీ గెలిచిన తర్వాత సగానికి సగం హామీలను తుంగలో తొక్కేస్తారు. ఇక తాజాగా అధికారంలో ఉన్న BRS మంత్రి కేటీఆర్ ప్రచారంలో భాగంగా ఇంకో ముఖ్యమైన హామీని ప్రజలకు ఇచ్చాడు. ఈ రోజు కేటీఆర్ వికారాబాద్ పరిగి లో పర్యటిస్తూ అక్కడి ప్రజలకు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ రూ. 5 లక్షల బీమాను చేయిస్తామని మాటిచ్చారు. ఎన్నికల అనంతరం ఫలితాలు వచ్చిన తర్వాత అంటే డిసెంబర్ 3వ తేదీ తర్వాత రాష్ట్రంలో కొత్త పథకం అమలులోకి వస్తుందని ఎంతో నమ్మకంగా కేటీఆర్ తెలియచేశారు. ఇది కాకుండా సౌభాగ్యలక్ష్మి పేరుతో మీఇంట్లోని ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ. 3 వేలు ఇస్తామని కేటీఆర్ ప్రకటించారు.
ఇంకా ఎన్నో హామీలను వికారాబాద్ పరిగి ప్రచార కార్యక్రమంలో ప్రజలకు చెప్పారు. అయితే తీరా గెలిచాకా ఈ హామీలను నెరవేరుస్తుందా లేదా అన్నది తెలియాలి.