ట్విట్టర్ వేదిగా అనేక మంది ప్రజల సమస్యలపై స్పందిస్తూ.. పరిష్కారం చూపిస్తుంటారు మంత్రి కేటీఆర్. మరోసారి ఇలాగే రహదారుల సమస్యపై స్పందించారు కేటీఆర్. ఇటీవల కంటోన్మెంట్ ప్రాంతంలో 21 రహదారులను మూసి వేశారు. ఈ సమస్యపై ఇటీవల ఓ నెటిజెన్ కేటీఆర్ కు ట్విట్ చేయగా.. కిషన్ రెడ్డికి రీట్విట్ చేశారు కేటీఆర్. లక్షలాది మందికి ఉపయోగించే ఈ రహదారులను.. ప్రజల అవసరాన్ని ద్రుష్టిలో పెట్టుకుని ఓపెన్ చేయాలని కోరారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఇటీవల 21 రోడ్లను మూసేశారని ఓ వాహనదారుడు కేటీఆర్ కు ట్విట్ చేశారు. దీంతో స్పందించిన కేటీఆర్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రీట్విట్ చేశారు. అయితే కిషన్ రెడ్డి ఈరోడ్ల వివరాలు ఇవ్వాల్సిందిగా కోరారు. సమస్య పరిష్కారం కోసం కేటీఆర్ చొరవను హైదరాబాదీలు అభినందిస్తున్నారు.
Dear Sri @kishanreddybjp Garu,
You wanted me to furnish the list of roads closed illegally within the Secunderabad Cantonment area
Here it is 👇 Hope you can do justice and ensure LMA reopens all roads immediately for the benefit of Millions of our citizens pic.twitter.com/3DR1quDNwn
— KTR (@KTRTRS) December 20, 2021