హైదరాబాద్ వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాదులో మరో భారీ ఫ్లై ఓవర్ ను… ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. షేక్ పేట్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ మహానగరంలో కొత్తగా నిర్మించిన షేక్ పేట ఫ్లై ఓవర్ ను తెలంగాణా రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నూతన సంవత్సర బహుమతిగా ఈ ఫ్లైఓవర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు మంత్రి కేటీఆర్.
దాదాపు 350 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టోలిచౌకి రిలయన్స్ మార్ట్ నుంచి షేక్ పేట, రాయదుర్గం మల్కo వరకు అంటే దాదాపు 2.8 కిలోమీటర్ల మేరకు నిర్మాణం చేపట్టారు. దాదాపు మూడు కిలోమీటర్ల ఇది హైదరాబాద్ నగరంలోని పొడవైన ఫ్లై ఓవర్ జాబితాలో చోటు సంపాదించుకుంది. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభం కారణంగా మెహదీపట్నం – హైటెక్ సిటీ మధ్య ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఇక ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం పై హైదరాబాద్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.