ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయిన కేటీఆర్..

-

బంజారాహిల్స్ ఏసిబి కార్యాలయం ఎదుట రసాభాసగా మారింది పరిస్థితి. ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన లాయర్లతో ఏసీబీ ఆఫీసుకు వెళ్లారు. అయితే, లాయర్లు ఎవరూ కూడా కేటీఆర్ వెంట వెళ్ళకూడదన పోలీసులు నిలిపివేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆఫీస్ ఎదుట మీడియాతో మాట్లాడుతూ.. ‘చట్ట ప్రకారం ప్రతి పౌరుడికి ఉన్నతన హక్కులను వినియోగించుకోనివ్వాలని కోరారు.

ఫార్ములా – ఈ కేసు తీర్పు హైకోర్టు రిజర్వ్ చేసింది.. ఈ సమయంలో నన్ను విచారణకు పిలవాల్సిన అవసరం లేదు.కానీ రాజ్యాంగం మీద, న్యాయ వ్యవస్థ మీద నాకు గౌరవం ఉంది. లాయర్ సమక్షంలో విచారణ జరుపుతారు.కానీ, నా తరఫు లాయర్లను అడ్డుకుంటున్నారు.తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. ఫార్ములా – ఈ వ్యవహారంలో మంత్రిగా నిర్ణయం తీసుకున్నా.. ఆ సమాచారం అంత ఏసీబీ దగ్గరే ఉంది.ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు’ అని పేర్కొన్నారు. ఏసీబీ ఆఫీస్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కేటీఆర తన లాయర్లతో కలిసి వెనుదిరిగారు. అరగంట వేచి చూసి తెలంగాణ భవన్‌కు వెళ్లిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news