ఢిల్లీలో హీటెక్కుతున్న పొలిటికల్ వెదర్… కాకపుట్టిస్తున్న కేజ్రీవాల్ కామెంట్స్..

-

ఎముకల కొరికే చలిలోనూ.. ఢిల్లీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి.. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. పొలిటికల్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. హీట్ ను మరింత పెంచేస్తున్నారు. ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ భాగస్వామిగా ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ పైనే ఆయన సంచలన వ్యాఖ్యలు చెయ్యడం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది.. ఇంతకీ కేజ్రీవాల్ చేసిన కామెంట్స్ ఏంటి..? వాటిని బిజేపీ, కాంగ్రెస్ లు ఎలా కౌంటర్ చేస్తున్నాయి..?

 

ఢిల్లీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి.. ఇప్పటికే బిజేపీ అభ్యర్దులను ప్రకటించింది.. కాంగ్రెస్ కూడా బలమైన నేతలను ఆన్వేషిస్తోంది.. ఇదే సమయంలో ప్రధాన పార్టీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.. ఢిల్లీని ఆప్ పదేళ్ల నుంచి నాశనం చేస్తోందని మోడీ విమర్శిస్తే.. కాంగ్రెస్ ను ఢి్ల్లీ ప్రజలు పట్టించుకోవడమే మానేశారని కేజ్రీవాల్ విమర్శిస్తున్నారు.. ఆప్ అధికారం కోసం అడ్డదారుల్లో విమర్శలు చేస్తోందని కాంగ్రెస్ ఘాటుగా స్పందిస్తోంది..

డిల్లీలోని నజఫ్ గడ్ లో నిర్మించనున్న సావర్కర్ కాలేజీ విషయంలో బిజేపీ, కాంగ్రెస్ లమధ్య మాటల యుద్దం నడుస్తోంది. కాలేజీ నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేశారు.. ఈ కాలేజీకి దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. సావర్కర్ పేరు పెట్టడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టడమే కాకుండా.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను బిజేపీ విస్మరిస్తోందని మండిపడుతోంది.. దీనిపై బిజేపీ కూడా స్ట్రాంగ్ కౌంటర్ఇచ్చింది..

ఈ వివాదం కొనసాగుతున్న వేళ.. ఆప్ ప్రభుత్వంపై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు.. ఢిల్లీ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో ఆప్ విఫలమైందని మండిపడ్డారు. గత పదేళ్లుగా ఢిల్లీని ఆప్ అనే విపత్తు చుట్టుముట్టిందని.. ప్రజలకు ఆ పార్టీ ప్రమాదకారి అంటూ విమర్శించారు. ఢిల్లీలో బిజేపీ అధికారంలోకి రావడం ఖాయమంటూ జోస్యం చెప్పారు.. కాంగ్రెస్,బిజేపీ విమర్శలకు ఆప్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.. ఆప్ ను ఓడించేందుకు బిజేపీ, కాంగ్రెస్ లు ఏకమయ్యాయని.. వారి కుట్రలను ఛేదించి..మరోసారి అధికారంలోకి వస్తామని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.. ఇలా మూడు పార్టీల అగ్రనేతల మధ్య డైలాగ్ వార్.. వింటర్ లో కూడా హీట్ పుట్టిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news