రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ

-

లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బుధవారం బహిరంగ లేఖ రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన అసమగ్ర కులగనన సర్వేపై పార్లమెంట్ ను తప్పుదోవ పట్టిస్తారా..? అంటూ రాహుల్ గాంధీని ప్రశ్నించారు. లక్షలాదిమంది వివరాలను సేకరించకుండానే కులగననా సర్వేను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందంటూ లోక్ సభలో రాహుల్ గాంధీ పేర్కొనడం పార్లమెంట్ ని తప్పుదోవ పట్టించడమేనని ఆరోపించారు.

ఈ క్రమంలో తెలంగాణలోని బీసీలకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదని తేలిపోయిందన్నారు. బీసీల జనాభాను తగ్గించి.. వెనకబడిన వర్గాలకు దారుణంగా వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. తప్పులతడకగా తీసిన లెక్కలతో సర్వే పూర్తయిందడం ముమ్మాటికి మోసం చేయడమేనని లేఖలో పేర్కొన్నారు కేటీఆర్. కాంగ్రెస్ సర్కార్ యూ టర్న్ తీసుకోవడంతో.. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ బూటకం అని తేలిపోయిందన్నారు.

పదేళ్ల క్రితం అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల సంఖ్య ఒక కోటి 85 లక్షలు గా తేలిందని.. రాష్ట్ర జనాభాలో ఇది 51% వచ్చిందని గుర్తు చేశారు. ఇక మైనారిటీల్లో ఉన్న బీసీలను కూడా కలిపితే బీసీల సంఖ్య ఏకంగా 61% కి చేరిందని స్పష్టం చేశారు. అలాంటిది 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కులగన సర్వేలో బీసీల జనాభా ఒక కోటి 64 లక్షలకు ఎలా తగ్గిందని, 46% కి ఎలా పడిపోయిందో చెప్పాలని రాహుల్ గాంధీని ప్రశ్నించారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version