ఏసీబీ విచారణకు కేటీఆర్.. పాడి కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్టు

-

ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని సోమవారం ఉదయం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తన కమ్యూనిటీ ఏరియాలో జిమ్ చేసేందుకు వెళ్తున్న టైంలో పోలీసులు అతన్ని అడ్డగించి హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం. కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు అతన్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్లడానికి అనుమతిని నిరాకరించారు.

దీంతో కౌశిక్ రెడ్డి వారితో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. నేడు ఫార్ములా ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు.ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేస్తున్నారు.అందులో భాగంగానే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. గులాబీ కేడర్, సీనియర్ నేతలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. అక్రమ అరెస్టులకు పాల్పడుతున్న కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news