బంజారాహిల్స్ ఏసిబి కార్యాలయం ముందు కేటీఆర్ వాహనాన్ని అడ్డుకున్నారు పోలీసులు. న్యాయవాదులు ఎవరు కూడా కేటీఆర్ వెంట వెళ్ళకూడదు అంటూ బంజారాహిల్స్ ఏసిబి కార్యాలయం ముందు కేటీఆర్ వాహనాన్ని అడ్డుకున్నారు పోలీసులు. చట్ట ప్రకారం ప్రతి పౌరుడికి ఉన్నతన హక్కులను వినియోగించుకోనివ్వాలని ఈ సందర్భంగా కేటీఆర్ పేర్కొన్నారు. ఏసీబీ ఆఫీస్ బైట మీడియాతో మాట్లాడారు కేటీఆర్.
ఫార్ములా – ఈ కేసు తీర్పు హైకోర్టు రిజర్వ్ చేసింది.. ఈ సమయంలో నన్ను విచారణకు పిలవాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. కానీ రాజ్యాంగం మీద, న్యాయ వ్యవస్థ మీద నాకు గౌరవం ఉందని చెప్పాఅరు. లాయర్ సమక్షంలో విచారణ జరుపుతారు.. కానీ నా తరఫు లాయర్లను అడ్డుకుంటున్నారన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందని ఆగ్రహించారు. ఫార్ములా – ఈ వ్యవహారంలో మంత్రిగా నిర్ణయం తీసుకున్నా.. ఆ సమాచారం అంత ఏసీబీ దగ్గరే ఉందని తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని తెల్చి చెప్పారు కేటీఆర్.