‘పాము – ముంగీస ’ కలిసినయ్?కేటీఆర్

-

తెరాస ను ఓడించడానికి పాము – ముంగిసాల్లాంటి… కాంగ్రెస్ – తెదేపాలు కలిశాయని కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో శుక్రవారం నిర్వహించిన పద్మశాలి సంఘాల కృతజ్ఞత సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… సిరిసిల్లకు మరో మూడేళ్లలో రైలు తీసుకొచ్చేలా ప్రయత్నం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.   సిరిసిల్ల మరో తిర్పూర్‌గా మారాలంటే ఈ ప్రాంతానికి రైలు సౌకర్యం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల పాలనలో నేతన్నల ఆత్మహత్యలు చేసుకున్న పట్టించుకునే నాథుడు లేడన్నారు.

సీఎం కేసీఆర్‌ మాత్రం జోలెపట్టి భిక్షాటన చేసి మరీ.. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. ఇతర ఏ రాష్ట్రాలు కేటాయించనంతగా  చేనేత కార్మికుల కోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1270 కోట్లు కేటాయించారన్నారు.  మహా కూటమిలో భాగంగా పాము – ముంగిసాల్లాంటి… కాంగ్రెస్ – తెదేపాలు కలిశాయి.. ఇక తెలంగాణలో పాలన ఎట్ల ఉంటదో ఆలోచించడి? తెలంగాణను మోసం చేయడానికి ఆ రెండు పార్టీలు జత కట్టాయి అని కేటీఆర్ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version