మధ్యాహ్న భోజనంలో టీచర్ల నిర్లక్ష్యం.. హైకోర్టుకే లేఖ రాసిన విద్యార్థులు

-

ఇది విద్యార్థుల సత్తా అంటే. ఇది విద్యార్థుల పవర్. విద్యార్థులు తలుచుకుంటే కొండ మీది కోతినైనా తీసుకురావచ్చని నిరూపించారు. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల ప్రాథమిక పాఠశాలలో ఓ అరుదైన, అద్భుతమైన ఘటన చోటు చేసుకున్నది. పిల్లలకు పాఠాలు చెప్పి విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లే అక్రమాలకు పాల్పడి.. మధ్యాహ్న భోజనాన్ని సరిగ్గా పెట్టకుండా డబ్బులన్నీ నొక్కేస్తున్నారు. ఈ ఘటనపై చాలా రోజుల్నుంచి ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసినా.. వాళ్లు పట్టించుకోవడం లేదని.. తమపై రివర్స్ దాడులు చేస్తున్నారని.. మధ్యాహ్న భోజనం తినలేకపోతున్నామని వాపోయిన విద్యార్థులు.. చేతగాని వాళ్లలా కూర్చోలేదు. వెంటనే ఏకంగా రాష్ట్ర హైకోర్టుకే లేఖ రాశారు. దీంతో ఈ ఘటన కాస్త ఆసక్తికరంగా మారింది.

గత నెల అక్టోబర్ 1న విద్యార్థులు తెలంగాణ హైకోర్టుకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాఠశాలలో జరుగుతున్న నిర్లక్ష్యంపై పూర్తి సమాచారం అందించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో డీఈవో పాఠశాలకు వచ్చి ఆరా తీశారు. దీంతో పాఠశాల హెచ్‌ఎం రాంకోటి, మరో ఇద్దరు టీచర్లు శ్యాంసుందర్‌రెడ్డి, హన్మంతులు ఈ అక్రమాలకు పాల్పడి.. పిల్లలకు సరైన భోజనం వడ్డంచడం లేదని తెలుసుకున్నాడు. వెంటనే వారిని సస్పెండ్ చేసి.. దానికి సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులను పంపించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version