తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావు కి కేంద్రం శుక్రవారం భారతరత్న ప్రకటించింది. ఇదే అంశం మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించడం హర్షించదగ్గ విషయమని అన్నారు.
ఈ నిర్ణయం తీసుకున్న మోడీ కి ధన్యవాదాలు చెప్పారు. కెసిఆర్ గారి నేతృత్వం లో తెలంగాణ ప్రభుత్వం గతం లో నిర్వహించిన పీవీ శత జయంతి వేడుకల్లో భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వస్తున్నామని అన్నారు. దీనికి గతం లో పీవీ కి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోస్ట్ చేసిన ట్వీట్ ని కూడా కేటీఆర్ ట్యాగ్ చేశారు