రాష్ట్రంలో ఎక్కడైనా 100 శాతం రుణమాఫీ జరిగిందా..? అని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు. సిరిసిల్ల లేదా కొడంగల్ లో ఎక్కడైనా నిరూపిస్తారా..? అని ప్రశ్నించారు. నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మరోవైపు అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేయడం సబబేనా అని ప్రశ్నించారు. ఒకరినీ జైలుకు పంపే అధికారం సీఎం రేవంత్ రెడ్డికి ఉండదని.. నేరాలు నిర్దేశించి జైలుకు పంపేది కోర్టులు అని వెల్లడించారు.
మరోవైపు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రతీ పనిలో కూడా గత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారు.. కేంద్రం తీరుపై ఎందుకు మాట్లాడలేకపోతున్నారని నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాకు వచ్చింది సున్నానే.. మరీ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు వచ్చింది గుండు సున్నా కాదా.. కొట్లాడకపోతే కేంద్రం నిధులు ఇవ్వదు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక్క మాట.. బయట మరో మాట మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.