IPL 2025: విశాఖలో సన్ రైజర్స్ హైదరాబాద్ కుప్పకూలింది. 18.4 ఓవర్లకే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆలౌట్ ఐంది. దింతో ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 164 పరుగులు ఫిక్స్ ఐంది. అటు హాఫ్ సెంచరీతో అనికేత్ వర్మ (74) రాణించాడు. మిచ్చెల్ స్టార్క్ 5 వికెట్లు తీసుకోగా, కుల్దీప్ యాదవ్ కు 3 వికెట్లు పడగొట్టాడు.
అటు సన్ రైజర్స్ హైదరాబాద్‌కు మిచెల్ స్టార్క్ మరోసారి విలన్‌గా మారాడు. నేడు జరుగుతున్న మ్యాచ్‌లో ఇప్పటివరకు మూడు కీలక వికెట్లు తీశాడు. మొత్తంగా 5 వికెట్స్ తీసాడు. ఇషాన్ (2), నితీష్ (0), హెడ్ (22)ను పెవిలియన్‌కు పంపి క్యాపిటల్స్‌కి హీరో అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్‌లో క్లాసెన్, అనికేత్ వర్మ కొనసాగుతున్నారు. 2024 IPL ఫైనల్‌లో SRH ఆశలను గల్లంతు చేయడంలో స్టార్క్ కీలక పాత్ర పోషించాడు.