నా రాజకీయ జీవితమే సినిమాలో నా పాత్ర అన్నారు జగ్గారెడ్డి. ముందుగా చెప్పినట్టుగానే జగ్గారెడ్డి ఆదివారం ఉగాది సందర్భంగా జయలక్ష్మీ సినిమాస్ పేరుతో నూతన ఆఫీస్ ప్రారంభించారు. సినిమా ఆఫీస్‌ను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రారంభించడంతో సర్వత్రా చర్చ నెలకొన్నది.అంతటితో ఆగకుండా 50 సెకన్లతో టీజర్‌ను కూడా జగ్గారెడ్డి రిలీజ్ చేశారు.
ఈ సందర్బంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ… ఇకపై ఈ సినిమా కార్యాలయమే నా అడ్డ అన్నారు. విద్యార్థి నేతగా, కౌన్సిలర్ గా, మున్సిపల్ చైర్మన్ గా నా సక్సెస్ ఫుల్ ప్రయాణం సినిమాలో చూడబోతున్నారు అన్నారు జగ్గారెడ్డి.