50 మంది మావోయిస్టులు లొంగుబాటు

-

ఛత్తీస్  గడ్ రాష్ట్రం సుక్మా జిల్లా బీజాపూర్ లో 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు.  బీజాపూర్ సీఆర్పీఎఫ్ డీఐజీ దేవేంద్ర నేగీ ఎదుట వీరంతా లొంగిపోయారు. మావోయిస్టు కీలక నేత రవీంద్ర కరం సైతం లొంగిపోయినట్టు తెలుస్తోంది. ఈయన పై రూ.8లక్షల రివార్డు ఉంది. మరో ఇద్దరూ కీలక మావోయిస్టులు రాకేశ్, రోషిణి పై రూ.8లక్సల చొప్పున రివార్డు ఉంది. మొత్తం 13 మంది మావోయిస్టులపై దాదాపు రూ.60 లక్షల రివార్డు ఉన్నట్టు సమాచారం.

వీరితో సహా మొత్తం 50 మంది మావోయిస్టులు తాజాాగా లొంగిపోయారు. వీరంతా గంగలూరు, బీజాపూర్ జిల్లాలో బాసగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో పని చేస్తున్నారని అంటున్నారు. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో 50 మంది లొంగిపోవడం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైందని చెబుతున్నారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు పార్టీని కూకటి వేళ్లతో సహా పెకలించి వేస్తామని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇందులో భాగంలో ఆపరేషన్ కగర్ ను తెరపైకి తీసుకొచ్చారు. మావోయిస్టు ఏరివేతను కొనసాగించారు. గత ఏడాదిలో ప్రారంభమైన ఏరివేతను కొనిసాగించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version