ఏపీ, తెలంగాణాలకు రాయితీలు ఇవ్వాల్సిందే..కేంద్రంపై కేటీఆర్‌ ఫైర్‌

-

కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన ఎడున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు లేవని.. కనీసం ఈసారి కేంద్ర బడ్జెట్ లో ఆయినా రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని.. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ కు స్పెషల్ ఇండస్ట్రియల్ రాయితీలు అందించాలని కోరారు.

తెలంగాణ కాకతీయ, మెగా టెక్స్ట్ పార్క్, ఫార్మా సిటీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇప్పటికి రాలేదని.. ప్రధానమంత్రి మోదీ పదే పదే సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటున్నారు….రాష్ట్రాలకు నిధులు విధుల్చకపోతే ఎలా సాధ్యమవుతుందని చెప్పారు. భారతదేశంలో నాలుగు పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి కేంద్రం సహరిస్తే వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సహకారం అవసరమని.. మా హక్కులు డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం చేస్తామని ప్రకటించారు. పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణను ఎంచుకున్నందుకు డ్రిల్ మేక్ కు ధన్యవాదాలు చెప్పారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version