సంవత్సరం దాటింది.. మోసాల పరంపర కొనసాగుతోంది. హర్యానా లో దెబ్బ తగిలింది.. మహారాష్ట్ర లో నమ్మలేదు, హిమాచల్ ప్రదేశ్ లో ఓట్ల కోసం మోసం చేశారు అని కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేజ్రివాల్ బెల్లం.. ఇప్పుడు కేజ్రీవాల్ అల్లం అయ్యారు. ఢిల్లీ లో కూడా కాంగ్రెస్ ఓడిపోతుంది. రేవంత్ రెడ్డి అవకాశవాది. ప్రజలు సోనియాగాంధీ, రాహుల్ గాంధి, ప్రియాంక గాంధీ ని చూసి మోసపోయారు. కాంగ్రెస్ పార్టీ తరుపున వీళ్ళే హామీలు ఇచ్చారు. ఇన్ని రాష్టాల్లో ఓడిపోతున్నా కాంగ్రెస్ కు బుద్ధి రావట్లేదు.
హిమాచల్ ప్రదేశ్ లో గంజాయి సాగు, టాయిలెట్ ల పై టాక్స్ ను చూస్తుంటే.. వేరే రాష్ట్రాల్లో కూడా తెస్తారేమో అనిపిస్తుంది. మేము చేసిన తప్పు ఏమి లేదు. రేవంత్ రెడ్డి కి దమ్ముంటే రమ్మనండి. ఇద్దరం లై డిటెక్టర్లు పెట్టుకుంటాం. నిజాలు అందరికీ తెలుస్తాయి. నా మీద విచారణ కోసం కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు. ఇది ఆయన అత్తగారు సొమ్ము కాదు.. ప్రజల సొమ్ము. మనిద్దరం కూర్చుందాం.. ఐదు పది లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. అన్ని విషయాలు ప్రజల కు తెలుస్తాయి. మీడియా లో మీరు అడిగిన ప్రశ్నలే వాళ్ళు విచారణ లో అడుగు తున్నారు. కొత్తగా ఏమి అడగట్లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.