బీజేపీ, నరేంద్ర మోదీకి అవకాశం ఇస్తే తెలంగాణను ఏపీలో కలుపుతారని.. మనల్ని కూడా అమ్మేస్తారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొరపాటున ఎవరైనా పిలగాళ్లు ఆగం అయితే.. మళ్లీ తెలంగాణను, ఆంధ్రను కలిపినా..కలుపుతారు ఈ పుణ్యత్ములు అని విమర్శించారు. బీజేపీ కుల, మతాల మధ్య విద్వేశాలు పెంచుతున్నారని విమర్శించారు. తెలంగాణకు ఏం చేశారని బీజేపీ ప్రశ్నించారు. నరేంద్రమోదీ అధికారం చేపట్టి ఏడున్నరేళ్లు అయిందని.. అయినా తెలంగాణలకు ఎలాంటి ప్రాజెక్ట్ లు ఇవ్వలేదనన్నారు. నవోదయ పాఠశాలలు, వైద్య కళాశాలలు, ఐఏఎంలు తెలంగాణకు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ప్రధాని కేవలం ఉత్తర్ భారత దేశానికి, ఉత్తర్ ప్రదేశ్ కు మాత్రమే ప్రధాన మంత్రా..? అని ప్రశ్నించారు.
బీజేపీకి అవకాశం ఇస్తే తెలంగాణను ఏపీలో కలుపుతాడు… కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
-