ఇప్పుడు దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఇలాంటి కరోనా కష్టసమయంలో అందరినీ కాపాడాలంటే వ్యాక్సిన్లు ఒక్కటే మార్గం. కానీ ఈ వ్యాక్సిన్ల చుట్టూ ఇప్పుడు రాజీకీయాలు నడుస్తున్నాయి. తెలంగాణలో మరీ ముఖ్యంగా టీఆర్ ఎస్‌కు బీజేపీకి మధ్య ఇదే వైరం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మొన్నటి వరకు దీనిపై కేటీఆర్ కౌంటర్ ఇస్తే… ఇప్పుడు హరీష్ రావు (Harish Rao) రంగంలోకి దిగారు.
తెలంగాణకు కేంద్రం వ్యాక్సిన్ల విషయంలో తీవ్ర అన్యాయం చేస్తోందని మొన్నటి వరకు కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్‌లో తయారవుతున్న వ్యాక్సిన్లలో కేంద్రం 85శాతం తీసుకుంటోందని, మిగతా 15శాతం కోసం అన్ని రాష్ట్రాలు కొట్లాడుకుంటున్నాయని విమర్శించారు. తెలంగాణకు సరిపడా వ్యాక్సిన్లు ఎందుకు ఇవ్వట్లేదని మండిపడ్డారు.
ఇప్పుడు ఇదే విషయంపై మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగారు. కేంద్రం వైపల్యం వల్లనే తెలంగాణలో వ్యాక్సిన్ల సమస్య ఎదురవుతోందన్నారు. హైదరాబాద్ లో వ్యాక్సిన్ల ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ తెలంగాణ అవసరాలకు తగ్గట్టు వ్యాక్సిన్లను కేంద్రం సరఫరా చేయట్లేదని విమర్శించారు. అయితే ఈ విమర్శలపై బీజేపీ మంత్రి కిషన్ రెడ్డి కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. దేశం మొత్తం వ్యాక్సిన్లు అందించాలని, ఒక్క తెలంగాణకే అన్నీ ఇవ్వాలంటే ఎలా అంటూ ప్రశ్నించారు. ఇక ముందు ఎలా ఉంటుందో చూడాలి వ్యాకన్ల మీద రాజకీయం.