గోధుమ రంగు గుడ్డు, తెలుపు రంగు గుడ్డు మధ్య తేడా ఏమైనా ఉంటుందా? రెండింటిలో ఏది ఎక్కువ ఆరోగ్యకరం.

-

మీలో చాలామంది ఇది చూసే ఉంటారు. తెలుపు రంగులో గుడ్డు చాలా సాధారణం. కానీ గోధుమ రంగులో గుడ్డు కనిపించడమే కొంచెం వెరైటీ. సూపర్ మార్కెట్లలో వీటిని చూసినపుడు చాలామందికి ఒక సందేహం వచ్చి ఉంటుంది. తెలుపు రంగు గుడ్డుకి, గోధుమ రంగు గుడ్డుకి ఏమైనా తేడా ఉంటుందా అని. దీనికి సమాధానం తెలియక చాలామంది గోధుమ రంగు గుడ్డుకి ఎక్కువ ధర చెల్లిస్తూ ఉంటారు. దానిక్కారణం గోధుమ రంగు గుడ్డులో అధిక పోషకాలు ఉంటాయని దుకాణదారులు చెప్పడమే.

అంటే, రెండింటికీ అసలు తేడానే ఉండదా అంటే ఉండదనే చెప్పాలి. గుడ్డు రంగు అనేది కోడి జాతి మీద ఆధారపడి ఉంటుంది. చికెన్ బ్రీడ్ ని బట్టి గుడ్డు రంగు ఉంటుంది. మీరు చూసే గోధుమ రంగు గుడ్డు మీరు రెగ్యులర్ గా చూసే కోడి బ్రీడ్ కాదన్నట్టు లెక్క. కానీ అందులో పోషకాలు మాత్రం తెలుపు రంగు గుడ్డులో ఎలా ఉంటాయో అదే విధంగా ఉంటాయి. వాటిల్లో ఏమాత్రం తేడా లేదు. కేవలం గుడ్డుపై పెంకు మాత్రమే రంగు మారుతుంది. లోపల అంతా సేమ్ టు సేమ్ అన్నమాట.

గోధుమ రంగులోనే కాదు కొన్ని కొన్ని గుడ్లు నీలిరంగులోనూ ఉంటాయి. ఈ రంగు అనేది ఒక్కో కోడిలో ఒక్కోలా ఉంటుంది. నాటుకోడి గుడ్డు రంగు కూడా తెలుపు రంగులో కాకుండా కొంచెం విభిన్నంగా ఉండడం మీరు చూసే ఉంటారు. దీన్ని బట్టి కోళ్ళ జాతుల్లో వివిధ రకాలు అవి పెట్టే గుడ్ల రంగుల మీద ప్రభావం చూపుతాయని అర్థం చేసుకోవాలి. గుడ్డు రంగు ఏదైనా అందులో పోషకాలు ఒకటే. దాన్నుండి వచ్చే ఆరోగ్యమూ ఒకటే. కాబట్టి అనుమానాలు మాని, హ్యాప్పీగా గుడ్డు తినండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version