బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న నిరసనలకు మద్దతు తెలిపేందుకు వెళతారని తెలిసి పోలీసులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో ఆయన్ను హౌస్ అరెస్టు చేసినట్లు సమాచారం.
అయితే, పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనల చేస్తున్న విషయం తెలిసిందే.నిన్న సాయంత్రం హెచ్ సీయూ విద్యార్థులు కేటీఆర్‌ను తెలంగాణ భవన్‌లో కలిసిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులకు అండగా ఉంటానని ఆయన భరోసానిచ్చారు.నేడు వారికి మద్దతుగా వెళ్తారేమోనన్న అనుమానంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.కాగా, 400 ఎకరాల్లోని చెట్లను జేసీబీల సాయంతో రేవంత్ సర్కారు తొలగించడాన్ని విద్యార్థులు, పర్యావరణ వేత్తలు తీవ్రంగా తప్పుబడుతున్నారు.