తెలంగాణ దశాబ్దిపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

-

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌)లో ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ‘ఇది తెలంగాణ దశాబ్ది’ అంటూ పేర్కొన్నారు.ఆరున్నర దశాబ్దాల పోరాటం..మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలు..వేల బలిదానాలు, త్యాగాలు..బిగిసిన సబ్బండ వర్గాల పిడికిళ్లు..ఉద్యమ సేనాని అకుంఠిత, ఆమరణ దీక్ష..ఉద్యమం విజయతీరాలకు చేరి స్వరాష్ట్రం సాక్షాత్కారం అయ్యింది!

ఉద్యమ నాయకుడే ప్రజాపాలకుడిగా ,స్వతంత్ర భారతదేశం ముందెన్నడూ చూడని సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి నమూనా ఆవిష్కారం అయ్యింది!పల్లె, పట్నం తేడా లేకుండా ప్రగతి రథం పరుగులు తీసింది.ఆహార ధాన్యాల ఉత్పత్తి నుండి,ఐటి ఎగుమతుల దాకా రికార్డులు బద్దలయ్యినయి.మీ అందరి మద్దతుతో నీళ్ళిచ్చి కన్నీళ్లు తుడిచినం.నిరంతర కరెంటిచ్చి వెలుగులు నింపినం.రైతన్నల, నేతన్నల, కష్టజీవుల కలత తీర్చినం.. కడుపు నింపినం.వృద్ధులకు ఆసరా అయినం..ఆడబిడ్డలకు అండగా నిలిచినం.సకల జనుల సంక్షేమానికి తెలంగాణను చిరునామా చేసినం.గుండెల నిండా జై తెలంగాణ నినాదం నింపుకున్నం.మన భాషకు పట్టం గట్టినం.మన బతుకమ్మ, మన బోనం సగర్వంగా తలకెత్తుకున్నం.గంగా జమునా తెహజీబ్ కు సాక్షీభూతంగా నిలిచినం.అవమానాలు ఎదుర్కొన్న గడ్డ మీదనే తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని అంబరమంత ఎత్తున ఎగరేసినం.కేసీఆర్ పాలన సాక్షిగాఇది తెలంగాణ దశాబ్ది!వెయ్యేళ్ళయినా చెక్కుచెదరని పునాది అని ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version