ఏపీలో దారుణం జరిగింది. పెళ్లైన 8 నెలలకే నవ దంపతులు అనుమానస్పద మృతి చెందారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తమ్మన్నమెరక సమీప కాలనీలో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు కొప్పుల చిరంజీవి(30), గీతల వెంకటలక్ష్మి(28) అనే నవ దంపతులు.

శుక్రవారం రాత్రి వారిద్దరు ఇంట్లో అనుమాస్పద స్థితిలో మరణించి ఉండడం గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకొని చూడగా విగతజీవిగా పడి ఉన్న భార్య, ఫ్యానుకు ఉరి వేసుకున్న భర్తను గుర్తించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.