ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎక్కడి నుండి ఎక్కడకు మారిందో ఆలోచిస్తేనే ఎంత ఆశ్చర్యకరం అనేది తెలుస్తుంది. ఒక దశలో పాకిస్తాన్ స్కోర్ ఈజీ గా 300 కు పైగా సాధిస్తుంది అని అనుకున్నారు. కానీ సడెన్ గా ఒక్క ఓవర్ లో కథ మొత్తం అడ్డం తిరిగింది. బాబర్ అజాం మరియు రిజ్వాన్ లు 80 కి పైగా పరుగులు చేసి మంచి టచ్ మీద ఉన్న దశలో సిరాజ్ బౌలింగ్ కు వచ్చి బాబర్ ను బౌల్డ్ చేశాడు.. ఇక ఆ తర్వాత 33వ ఓవర్ లో అసలు కథ మొదలైంది. చైనామన్ కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో షావుద్ షకీల్ ను రెండవ బంతికి ఎల్బీడబ్ల్యు గా అవుట్ చేసిన కుల్దీప్, అదే ఓవర్ లో ఆఖరి బంతికి ప్రమాదకర ఇఫ్తికార్ అహమద్ ను బౌల్డ్ చేసి ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు పడగొట్టి ఇండియాకు గేమ్ ఛేంజర్ గా మారిపోయాడు. ఆ తర్వాత ఇక పాకిస్తాన్ పేకమేడలా కూలిపోయి 191 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది.
ఈ విధమైన ముగింపును పాకిస్తాన్ అస్సలు ఊహించి ఉండదు. ఇక మ్యాచ్ లు ఎవరు గెలుస్తారు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో ?